యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కీలక వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. చట్టాలపై నమ్మకం ఉందన్నారు. పోలీసులకు తాను సహకరిస్తానని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం తప్పేనని ఒప్పుకున్నారు. నష్ట పోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చ లేనిదన్నారు. ఇదిలా ఉండగా తనపై కేసు నమోదు కాగానే ఈ అమ్మడు హైకోర్టును ఆశ్రయించింది తనను అరెస్ట్ చేయొద్దంటూ.