అందాల పోటీలు కట్టపెట్టి మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి. ఎంఎంటీఎస్ ట్రైన్ లో బాధితురాలపై అత్యాచారం యత్నం జరిగినా ఇప్పటి వరకు సర్కార్ నుంచి స్పందన లేక పోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. మహిళ కోచ్ లోకి ప్రవేశించి అత్యాచారం యత్నానికి పాల్పడడం చూస్తే మనం ఎక్కడున్నామో తెలియకుండా పోయిందన్నారు. ఆగంతకుడి నుంచి తప్పించు కునేందుకు బాధితురాలు ట్రైన్ దూకాల్సి వచ్చిందన్నారు. తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతోందన్నారు.