టీటీడీకి భారీగా సిఫార్సు లేఖలు
NEWS Mar 24,2025 02:52 pm
టీటీడీకి పెద్ద ఎత్తున సిఫార్సు లేఖలు అందాయి. మార్చి 24 నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని ఈవో శ్యామల రావు ప్రకటించారు. దీంతో ఇవాళ ఒక్క రోజే 90 మంది ప్రజా ప్రతినిధుల నుంచి లేఖలు అందాయని పేర్కొన్నారు. 180 మంది ప్రజా ప్రతినిధుల లేఖలు స్వీకరించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోందన్నారు.