హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి సోమవారం షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అదే రోజున నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ. 7న నామినేషన్లు పరిశీలిస్తారు. ఏప్రిల్ 9న నామినేషన్లు ఉపసంహరణ చివరి తేదీ. ఏప్రిల్ 23న పోలింగ్, 25న కౌంటింగ్ చేస్తారు. ఇదిలా ఉండగా వచ్చే నెల మే1 వరకు ప్రస్తుతం ఉన ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీ కాలం ఉంది. దీంతో ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేశారు.