మాజీ మంత్రి విడదల రజనీపై నిప్పులు చెరిగారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. తాను కాల్ డేటా తీసుకున్నానని చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దమన్నారు. తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారని మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు అడ్డగోలు పనులు చేసింది మీరు కాదా అంటూ నిలదీశారు ఎంపీ. తాము ఇప్పుడు విద్యా సంస్థలను నడపడం లేదన్నారు. గత 40 ఏళ్ల నుంచి వాటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో తమకు భూములు కావాలని ఆనాటి జగన్ రెడ్డి సర్కార్ ను కోరలేదన్నారు.