నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కుట్ర
NEWS Mar 24,2025 10:14 am
తన ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించి తీవ్రంగా స్పందించారు జస్టిస్ యశ్వంత్ వర్మ . ఇదింతా తనపై కావాలని కుట్ర పన్నారని, తన ప్రతిష్టను దెబ్బ తీయడంలో భాగంగానే దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎలాంటి నోట్ల కట్టలు బయట పడలేదన్నారు. ఇదిలా ఉండగా మార్చి 15ననే సీజేఐ దృష్టికి డబ్బుల విషయం వచ్చిందని తెలిసింది. జస్టిస్ వర్మకు మూడు ప్రశ్నలు వేసింది. ఆర్నెళ్ల కాల్ రికార్డులు తీసుకోవాలని సూచించింది. తన మొబైల్ ఫోన్లను పారేయొద్దని, వాటిలో డేటా డిలీట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది.