అన్న క్యాంటీన్ కు రూ. కోటి విరాళం
NEWS Mar 24,2025 09:53 am
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఫౌండర్, చైర్మన్ నార్నే రంగారావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి డాక్టర్ శాంతారావు భారీ విరాళాన్ని అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు. రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు రూ.1,00,01,016 విరాళంగా అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్న క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించింది. ప్రతి రోజూ లక్షలాది మంది అన్నార్థుల ఆకలిని నింపుతోంది. ఈ సందర్భంగా సర్కార్ చేస్తున్న ప్రయత్నం అద్భుతమని కొనియాడారు శాంతా రావు.