ఏపీలో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున రైతులు పంటలను కోల్పోయారని , వెంటనే పంట నష్టానికి సంబంధించి అంచనా వేయాలని సంబంధిత వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో వడగళ్ల వర్షం కారణంగా ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. రైతులకు తగు సూచనలు చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.