చెన్నై దెబ్బకు ముంబై విలవిల
NEWS Mar 23,2025 09:58 pm
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మూడో లీగ్ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా రాణించింది. ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేసింది. సీస్కే బౌలర్లు రెచ్చి పోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 రన్స్ మాత్రేమ చేసింది. పవర్ ప్లే లో 3 వికెట్లు కోల్పోయిన సమయంలో తిలక్ వర్మ 31 రన్స్ చేయగా కెప్టెన్ సూర్య యాదవ్ 29 రన్స్ చేసి ఆదుకున్నారు. డెత్ ఓవర్లలో దీపక్ చాహర్ 28 , శాంట్నర్ 11 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేసింది. రోహిత్ శర్మ సున్నాకే వెనుదిరిగాడు. రియాన్ 13 , విల్ జాక్స్ 11 పరుగులకే చాప చుట్టేశారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ సాధించింది.