ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి : మాజీమంత్రి
NEWS Mar 23,2025 09:41 pm
MBNR: గత రాత్రి కురిసిన వర్షాలకు పంటలు పాడే నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇవాళ పాడైన పంటలను రైతులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40వేలు ఆర్థిక సహాయం అందించి, తక్షణ సహాయం కింద రూ.10 వేలు అందించాలని శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.