పాడైన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే
NEWS Mar 23,2025 09:42 pm
MBNR: గత రాత్రి కురిసిన అకాల వర్షాలకు మహబూబ్ నగర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 1.520 రైతుల పంట నష్టం జరిగిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బొక్కలోనిపల్లి, చౌదర్ పల్లి, జనంపల్లి, జమిస్తాపూర్, రామచంద్రపురం గ్రామాలలో ఆదివారం ఎమ్మెల్యే పర్యటించి అకాల వర్షాలకు పాడైన పంటలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు.