కూటమి సర్కార్ నాపై కక్ష కట్టింది
NEWS Mar 23,2025 04:25 pm
మాజీ మంత్రి విడదల రజిని నిప్పులు చెరిగారు. తనపై ఏసీబీ కేసు నమోదు చేయడం, ఏ1గా చేర్చడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది పూర్తిగా కూటమి సర్కార్ కావాలని కక్ష సాధింపు ధోరణితో చేసిందంటూ ఆరోపించారు. ఆధారాలు లేకుండా కేసులు పెడుతోందన్నారు. బీసీ మహిళ అయిన తనను రాజకీయంగా ఎదగకుండా చేసేందుకు ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వాళ్లు ఎదుగుతుంటే తట్టుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు రజిని.