MBNR: దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం వేముల గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షంతో పాటు వడగళ్ల వానకు చేతికి వచ్చిన వరి పంట నేల రాలి, వరిగడ్డి మాత్రమే మిగిలి పోయింది. దీంతో అన్నదాతలకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. చేతికి వచ్చిన పంట నేలపై రాలిపోవడంతో ఆదివారం రైతుల ఆవేదన వెలిబుచ్చారు. అకాల వర్షాలకు వరి పంటను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.