మేడిపల్లి శివారులో డీసీఎం వ్యాను ఢీ లారీ ఢీకొట్టింది. కోరుట్ల నుంచి జగిత్యాల వైపు కర్బుజా లోడ్తో వెళుతున్న డీసీఎం వ్యాన్ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక వైపు రహదారిపై బారీకేడ్లు ఏర్పరచి లారీ, డీసీఎం వ్యాన్ను పోలీసులు తొలగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.