బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావు
NEWS Mar 23,2025 09:18 am
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్రధారిగా ఉన్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇక్కడి నుండి అమెరికాకు చెక్కేశాడు. ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. తనకు 65 ఏళ్ల వయసు ఉందని అనారోగ్యంతో బాధప డుతున్నానని దావాలో పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవంటూ స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోరారు.