ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ కు భారీ బందోబస్తు
NEWS Mar 23,2025 08:59 am
టాటా ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో 2వ కీలక మ్యాచ్ కు వేదిక కానుంది హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆదివారం కావడంతో ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తిని రేపుతోంది. పూర్తిగా బ్యాటింగ్ పిచ్ కావడంతో ఫోర్లు, సిక్సర్ల మోత మోగనుంది స్టేడియం. ఇక టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. ఇదిలా ఉండగా రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 2,700 మంది పోలీసులతో సెక్యూరిటీతో పాటు 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.