NGKL: కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ నిర్మల విద్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న బాలకృష్ణమ్మ (49) నీటి సంపులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి ఆవరణలోని సంపులో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు జారి పడినట్లు చెప్పారు. స్థానికులు గమనించి ఆమెను బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు.