మార్చి 25, 30 తేదీలలో వీఐపీ దర్శనాలు రద్దు
NEWS Mar 23,2025 08:22 am
టీటీడీ సంచలన ప్రకటన చేసింది. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు సంబంధించి తీపి కబురు చెప్పింది. ఈ మేరకు మార్చి 24న సోమవారం నుంచి సిఫార్సు లేఖలు స్వీకరించనున్నట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. టీటీడీ ఇంతకు ముందు ప్రకటించినట్లుగా, మార్చి 25, 30 తేదీలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, శ్రీ విశ్వవాసు నామ సంవత్సర తెలుగు ఉగాది ఆస్థానం దృష్ట్యా సంబంధిత తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గమనించి తమతో సహకరించాలని విన్నవించారు ఈవో.