హైదరాబాద్ లో సన్ రైజర్స్ వర్సెస్ రాయల్స్
NEWS Mar 23,2025 07:38 am
హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా రెండో మ్యాచ్ కు సిద్దమైంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పెద్ద ఎత్తున స్టేడియంకు తరలి రానున్నారు. ఇప్పటికే మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు అన్నీ అమ్ముడు పోవడం క్రికెట్ పట్ల ఉన్న ఆదరణకు అద్దం పడుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, ఐటీ, లాజిస్టిక్, తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్‌య జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు పేర్కొన్నారు.