పోసాని కృష్ణ మురళి విడుదల
NEWS Mar 22,2025 08:49 pm
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జైలు పాలైన నటుడు పోసాని కృష్ణ మురళికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాత్రి ఆయన గుంటూరు జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. బయటకు వచ్చిన అనంతరం పోసాని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉండగా గత నెల 26వ తేదీన అరెస్ట్ అయ్యారు. ఆయనపై 17 కేసులు నమోదయ్యాయి. రూ. 2 లక్షల పూచీ కత్తుపై రిలీజ్ చేశారు. పోసాని ఎక్కడా మాట్లాడ వద్దని ఆదేశించింది కోర్టు.