ఆన్ లైన్ గేమింగ్ యాప్స్..వెబ్ సైట్స్ బ్లాక్
NEWS Mar 22,2025 08:00 pm
కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. బెట్టింగ్ యాప్స్ దందా , మోసం పెద్ద ఎత్తున జరుగుతుండడం, కోట్లల్లో వ్యాపార లావాదేవీలు కొనసాగుతుండడంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది దేశ వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేస్తూ అడ్డంగా దొరికి పోయిన 11 మంది యూట్యూబర్స్ తో పాటు సినీ రంగానికి చెందిన నటీ నటులపై కేసులు నమోదు చేశారు. దీనిపై ఈడీ కూడా ఆరా తీస్తోంది. తాజాగా సెక్షన్ 69 కింద 357 ఆన్ లైన్ గేమ్స్ వెబ్ సైట్ ల యుఆర్ఎల్ లను బ్లాక్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది.