ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలి
NEWS Mar 22,2025 01:55 pm
క్రీడా మైదానాల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరులో పర్యటించిన మంత్రి పాఠశాలలను సందర్శించి..క్రీడా మైదానాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధికంగా బడ్జెట్ లో నిధులను కేటాయించిందని చెప్పారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో హడ్కో కింద భారీ ఎత్తున నగరాభివృద్దికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు నారాయణ.