వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు
NEWS Mar 22,2025 04:42 pm
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డ్ ను ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు ప్రకటించింది. ఆయన స్వస్థలం ఛత్తీస్ గఢ్. ఈ పురస్కారానికి ఎంపికైన తొలి రచయిత శుక్లా కావడం విశేషం. ఇది 59వ జ్ఞానపీఠ్ అవార్డు గమనార్హం. ఈ సందర్బంగా అవార్డు ఎంపిక కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. గత కొన్నేళ్లుగా సాహిత్య రంగంలో విశేష కృషి చేశారు శుక్లా. తన రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారు. సమాజాన్ని ప్రభావితం చేశారని పేర్కొంది.