మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ గ్రామస్థులు ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని ఆర్డీవో శ్రీనివాస్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని పెద్దవాళ్లు ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలించడంతో నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. దీంతో తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని ఆర్డీవోను కోరారు.