కౌశిక్ రెడ్డికి శ్రీధర్ బాబు క్లాస్
NEWS Mar 22,2025 04:31 pm
అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి బాగా లేదని అన్నారు. మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్ లో మంత్రి సీతక్క ఉంటుందన్నారు. దీన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. నువ్వు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండడం లేదా అని నిలదీశారు. ఆదివాసీ గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్కపై నోరు పారేసుకుంటే ఎలా అని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు.