డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారు
NEWS Mar 22,2025 02:27 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో ఇవాళ జరిగిన డీలిమిటేషన్ సమావేశంపై నిప్పులు చెరిగారు. ఇది డీలిమిటేషన్ మీటింగ్ కాని చంబల్ లోయ ముఠా సమావేశం అంటూ మండిపడ్డారు. ప్రజల దారి మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. ఈ మీటింగ్ ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని తేలి పోయిందన్నారు. తమ ప్రభుత్వం డీలిమిటేషన్ పై గైడ్ లైన్స్ నిర్ణయించ లేదన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్.