కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్ కు షాక్
NEWS Mar 22,2025 02:15 pm
మంత్రి దాసరి సీతక్కపై సంచలన వ్యాఖ్యలు చేశారు సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి రావి శ్రీనివాస్. ఆమెపై విమర్శలు చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. మార్చి 28 లోపు తమ నోటీసులకు సమాధానం ఇవ్వాలని లేక పోతే వేటు తప్పదని హెచ్చరించింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు జి. చిన్నారెడ్డి. కాగా పార్టీ నేతల నుండి కూడా రావి శ్రీనివాస్ పై పలు ఫిర్యాదులు తమకు అందినట్లు తెలిపారు.