దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలి
NEWS Mar 22,2025 01:54 pm
నియోజకవర్గాల పునర్విభజనపై మనందరిని ఏకతాటిపై తెచ్చిన సీఎం స్టాలిన్ ను అభినందిస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశం పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందన్నారు. బీజేపీ జనాభా జరిమానాల విధానాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు. 1971లో జనాభాను నియంత్రించాలని దేశం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తే ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమయ్యాయని మండిపడ్డారు.