సత్యదేవుని ఆలయంలో వైభవంగా ప్రాకార సేవ
NEWS Mar 22,2025 02:28 pm
శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతీ శనివారం నిర్వహించే ప్రాకార సేవను ఈరోజు వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల వేద మంత్రాలు, మేళ తాళాల నడుమ స్వామి, అమ్మవారి ప్రాకార సేవ జరిపించారు. అనంతరం ఆలయ పురవీధులు స్వామి వారిని ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు ప్రాకార సేవలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు