ఐపీఎల్ బెట్టింగ్ ల జోలికి వెళ్ల వద్దు
NEWS Mar 22,2025 02:34 pm
క్రికెట్ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని, ఐపీఎల్ మొదలు కావడంతో బెట్టింగ్ లు జోరందుకుంటాయని హెచ్చరించారు కరీంనగర్ జిల్లా ఎబీవీపీ కన్వీనర్ పూసాల విష్ణు. బెట్టింగ్ అనేది ఓ విష వలయమని, ఒక్కసారి దీనిలో చిక్కుకుంటే బయటకు రావడం కష్టమన్నారు. గతంలో చాలా సార్లు వీటి బారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే అప్రమ్తంగా ఉండాలని సూచించారు. మొదట లాభాలు చూపించి సర్వం దోచేస్తారని పేర్కొన్నారు. సరదాగా మొదలై వ్యసనంగా మారుతుందన్నారు విష్ణు.