ఇసుక రీచ్‌ను రద్దు చేయాలంటూ ఆందోళన
NEWS Mar 22,2025 11:24 am
మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలోని ఇసుక రీచ్‌ను వెంటనే రద్దు చేయాలని గ్రామస్థులు గ్రామ పంచాయతీ ఆవరణ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో ప్రభుత్వం ఇసుక రీచ్ ను ఏర్పాటు చేయడంతో గ్రామంలోని చెరువులు, కుంటలు, బోర్లలో నీరు అడుగంటి పోయి పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు రీచ్‌ను రద్దు చేసి గ్రామాన్ని ఆదుకోవాలన్నారు.