నేటి నుంచి ఐపీఎల్ మహా సంగ్రామం
NEWS Mar 22,2025 08:39 am
టాటా ఐపీఎల్ 2025 టోర్నీ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు బీసీసీఐ , ఐపీఎల్ గవర్నింగ్ బాడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రారంభ కార్యక్రమాలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించనుంది. తాజా, మాజీ క్రికెటర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, భారతీయ సినీ పరిశ్రమకు చెందిన అగ్ర నటీ నటులు కూడా హాజరవుతారు. ప్రముఖ గాయనీ గాయకులు తమ పాటలతో అలరించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ అజింక్యా రహానే నేతృత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ ఆడనుంది. రెండు నెలల పాటు ఈ టోర్నీ జరగనుంది.