పోసాని కృష్ణ మురళికి కోర్టు ఊరట
NEWS Mar 22,2025 08:19 am
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను దూషించిన కేసులో జైలులో ఉన్న నటుడు పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. గుంటూరు సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి బెయిల్ లభించింది. నిన్ననే బెయిల్ లభించినా పేపర్లు రావడం ఆలస్యం కావడంతో విడుదల కాలేక పోయారు. ఇవాళ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఆయన తరపు న్యాయవాదులు. ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి కేసులు లేవంటున్నారు. ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్నారు పోసాని కృష్ణ మురళి.