వంశీరాం బిల్డర్స్ పై పోలీసులకు ఫిర్యాదు
NEWS Mar 22,2025 08:15 am
హైదరాబాద్ లోని సర్వే నెం.27, 5లోని చెరువులో మట్టి నింపిన వంశీరాం బిల్డర్స్ పై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు నీటి పారుదల శాఖ ఏఈ. నానక్ రాం కుంట బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించారని ఆరోపించారు. ఇదిలా ఉండగా చెరువులు పూడ్చేస్తున్నా హైడ్రా పట్టించు కోవడం లేదంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపించడం కలకలం రేపింది. కాగా తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదంటోంది హైడ్రా. ఈ సందర్బంగా నానక్ రామ్ కుంటను కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. చెరువులో మట్టిని తొలగించాలని ఆదేశించారు.