హరీశ్ రావు కామెంట్స్ భట్టి సీరియస్
NEWS Mar 22,2025 08:06 am
శాసన సభలో మాజీ మంత్రి హరీశ్ రావు పరిధి దాటి మాట్లాడుతున్నాడని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఆర్థిక మాంద్యమా? బుద్ధి మాంద్యమా అని మాట్లాడటం తన స్థాయికి తగదన్నారు. తాను కూడా గతంలో మంత్రిగా పని చేశారని ఇలాగేనా వ్యవహరించేది అని ఫైర్ అయ్యారు. భాష పట్ల హరీష్ రావు పద్దతిగా మాట్లాడటం నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు భట్టి. బుద్ది మాంద్యం అన్న మాట విత్ డ్రా చేసుకోవాలని సూచించారు. జగదీశ్ రెడ్డి బాటలో హరీశ్ రావు వెళుతున్నారని తగ్గించుకుంటే మంచిదన్నారు.