తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం
NEWS Mar 22,2025 07:53 am
రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, మియాపూర్, మదీనాగూడ, ప్రగతినగర్, బాచుపల్లి, బోరబండ, మధురానగర్, బోయిన్‌పల్లి, ప్యారడైజ్,గండిమైసమ్మ, కొండపూర్, ముషీరాబాద్ , తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ఇదిలా ఉండగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.