ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ కు భారీ బందోబస్తు
NEWS Mar 21,2025 07:47 pm
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లకు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. 2,700 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. 300 మంది ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్‌లో 1,218 మంది, 12 బెటాలియన్లు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అంతే కాకుండా స్టేడియంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 450 సీసీ కెమెరాలు కూడా ఉంచుతామన్నారు. ఐపీఎల్ లో భాగంగా తొలి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది.