రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
NEWS Mar 21,2025 07:51 pm
WNP: పెబ్బేరు పట్టణ కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణ కేంద్రంలోని శుక్రవారం ఎస్సీ కాలనీ సమీపంలో ఆర్టీసీ బస్సు వ్యక్తిని ఢీ కొట్టడంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చెలిమిల్ల గ్రామ డీలర్ హనుమంతుగా గుర్తించారు. స్థానికులు సమాచారమివ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.