ఖాకీల నిర్వాకం ఎమ్మెల్యే ఆగ్రహం
NEWS Mar 21,2025 04:28 pm
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. శాసన సభ సాక్షిగా పోలీసులు అనుసరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను 2 గంటల పాటు నిర్బంధించారని ఆరోపించారు. తాను ప్రజా సమస్యల గురించి ప్రస్తావించానని, ఇందులో తప్పు ఏముందంటూ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం తనను నిర్బంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు మహేశ్వర్ రెడ్డి . అయితే ఇది సభకు సంబంధం లేదని, అసెంబ్లీ బయట జరిగిందని వివరణ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు.