సినీ నటులపై నారాయణ ఫైర్
NEWS Mar 21,2025 04:24 pm
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిప్పులు చెరిగారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో సినీ ప్రముఖులు ఉండడంపై మండిపడ్డారు. గుట్కా, పాన్, బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కోసం సినీ కళాకారులు తమ కీర్తిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అనైతిక పనులు చేసి డబ్బులు సంపాందించడం దారుణం అన్నారు. ఈ ప్రమోషన్స్ మీకు అవసరమా అంటూ సినిమా వాళ్లను ప్రశ్నించారు. కళామ తల్లికి సేవ చేయడం అంటే ఇదేనా అని మండిపడ్డారు. కళామ తల్లి మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చిందని, దానిని మీరు ఎన్ క్యాష్ చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.