సీఎం రేవంత్ తో నాబార్డ్ చైర్మన్ భేటీ
NEWS Mar 21,2025 04:16 pm
నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని, మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలని చైర్మన్ ను కోరారు. అంతే కాకుండా సహకార సంఘాలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కోరారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలన్నారు. ఇదిలా ఉండగా కొత్త జిల్లాల్లో డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు నాబార్డు చైర్మన్.