ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరకడంపై దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఆయనను కొలీజియం సిఫార్సు ఆధారంగా అలాహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది సుప్రీంకోర్టు. దీనిపై అక్కడి బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇది హైకోర్టు అని చెత్త బుట్ట కాదని పేర్కొంది. ఇదే సమయంలో ఈ నోట్ల కట్టల వ్యవహారంపై రాజ్యసభలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిపై స్పందించిన దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ పారదర్శకంగా విచారణ జరుగుతోందని చెప్పారు. గతంలో జ్యూడిషియల్ అకౌంటబులిటీపై ఇచ్చిన నోటీసు పెండింగ్ లో ఉండగా ఈ ఘటన జరగడం షాకింగ్ కు గురి చేసిందన్నారు ఎంపీ జైరామ్ రమేశ్.