జగన్ రెడ్డి వల్లే వైసీపీకి రాజీనామా
NEWS Mar 21,2025 03:45 pm
ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మర్రి రాజశేఖర్. ఈ సందర్బంగా పార్టీ చీఫ్ , మాజీ సీఎం జగన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా మాజీ మంత్రి విడుదల రజనిపై భగ్గుమన్నారు. పార్టీలో తనకు గుర్తింపు లేకుండా చేశారని, చులకనగా చూశారని వాపోయారు. వైసీపీ నుంచి వెళ్లి పోవడానికి జగనే కారణమని వాపోయారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. 2023 చివరలో ఎమ్మెల్సీ ఇచ్చారని మండిపడ్డారు. ఓడి పోయిన రజనిని చిలకలూరిపేటకు ఇంఛార్జ్ చేశారని ధ్వజమెత్తారు. ఆమెకు సపోర్ట్ చేసి తనను అవమానానికి గురి చేశారని అన్నారు. త్వరలోనే టీడీపీలో చేరుతానని ప్రకటించారు.