టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కానివ్వం
NEWS Mar 21,2025 12:41 pm
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తిరుమలలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ముంతాజ్ హోటల్, దేవలోక స్థల కేటాయింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కానివ్వమని స్పష్టం చేశారు. ఆస్తులను ఆక్రమిస్తే తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లో వెంకటేశ్వర ఆలయాలు నిర్మిస్తామన్నారు. తిరుమలలో హిందువులే పని చేయాలని, ఆలయ పవిత్రత కాపాడాలని సూచించారు. స్వామి వారి సన్నిధిలో తాగు నీటి సమస్య రానివ్వమన్నారు.