త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
NEWS Mar 21,2025 12:25 pm
పోలీసు సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి వంగలపూడి అనిత.
ప్రభుత్వ అనుమతులు రాగానే పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. కోర్టు చిక్కుముడులను అధిగమించి 1995 బ్యాచ్‌కు ప్రమోషన్లు కల్పిస్తామని ప్రకటించారు. కోర్టు అనుమతితో కమిటీ ఏర్పాటు చేసి ప్రమోషన్ సమస్యకు పరిష్కారం చూస్తామన్నారు. ట్రైబల్ బెటాలియన్ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించామని చెప్పారు. కూటమి సర్కార్ ప్రజల భద్రత కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న పోలీసు కుటుంబాలకు మేలు చేకూర్చేలా చేస్తామన్నారు వంగలపూడి అనిత.