గంగారాం చెరువును పరిశీలించిన రంగనాథ్
NEWS Mar 21,2025 10:31 am
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జూలు విదిల్చారు. నగరంలో కబ్జాలకు గురైన చెరువులను గుర్తించే పనిలో పడ్డారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున బాధితులు క్యూ కడుతున్నారు. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు చేపట్టేందుకు ఉపక్రమించారు. ఇదే సమయంలో గంగారాం చెరువును స్వయంగా పరిశీలించారు. అక్కడ యధేశ్చగా, ఎలాంటి అనుమతి పొందకుండా మట్టిని తవ్వుతున్నారని , బయటకు తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శేరిలింగంపల్లి మండలంలోని చందానగర్ లో ఉన్న ఈ చెరువును తనిఖీ చేశారు. కార్పొరేటర్ మంజుల, హైడ్రా అధికారులు, ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు.