మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి
NEWS Mar 21,2025 07:25 am
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఓటేరు చెరువు దురాక్రమణ జరుగుతోందని ఆవేదన చెందారు. మీ పేరు చెప్పుకుని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ నాయుడు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. తిరుమల పర్యటనలో ఉన్న మీరు వెంటనే ఈ ఆక్రమణపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. చెరువును కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.