తిరుమల సన్నిధిలో చంద్రబాబు
NEWS Mar 21,2025 07:07 am
ఏపీ సీఎం చంద్రబాబు తన కుటుంబీకులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు, అడిషనల్ ఏవో వెంకయ్య చౌదరి. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమల లోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు భార్య భువనేశ్వరి, కొడుకు, మంత్రి నారా లోకేష్, కోడలు, హెరిటేజ్ ఎండీ నారా బ్రాహ్మణి, మనవడు నారా దేవాన్ష్ ఉన్నారు. బాబును టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, శాంతా రామ్, పి. రామ్మూర్తి, ఎస్. నరేష్ కుమార్ , ఇతర అధికారులు కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చారు.