వాళ్లకు టీటీడీ మాకు వైటీడీ
NEWS Mar 20,2025 07:39 pm
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీలోని టీటీడీపై భగ్గుమన్నారు. ప్రతిసారి వాళ్లను మా ఎమ్మెల్యేలు లెటర్లతో దర్శనం అడుక్కోవడం ఎందుకంటూ ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మాకు వైటీడీ ఉందన్నారు. భద్రాచలంలో రాముడు లేడా ..మనకు శివాలయాలు లేవా అంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో తనను ఎవరూ నమ్మడం లేదంటూ వాపోయారు. మార్కెట్ లో ఎవరూ అప్పులు ఇవ్వడం లేదన్నారు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు రూ.8000 కోట్లు పెండింగ్ ఉన్నాయని, డబ్బులు ఎక్కడి నుండి తీసుకు రావాలని అన్నారు సీఎం.