ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో నమస్తే ఇండియా అంటూ ప్రసంగించారు. భారత దేశం భిన్న మతాలతో కూడుకుని ఉన్నదని, ఇక్కడి వాతావరణం తనకు ఎంతగానో నచ్చిందన్నారు. ఇక్కడి నాగరికత, సంస్కృతి అద్భుతమని ప్రశంసించారు. తెలంగాణలో చాలా దేవాలయాలను సందర్శించానని చెప్పారు. తను అలౌలికక ఆనందానికి లోనైట్లు తెలిపారు.